ఏపీలో 175కు 175 శాస‌న స‌భ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌ను దిశానిర్దేశం చేశారు. ఈ సభలో సీఎం ప్రసంగం తర్వాత మంత్రి అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌రమైన పోస్టు పెట్టారు. వైసీపీ పార్టీ ప్రతినిధుల సభతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేర్ మారిందట, ఫ్యాన్ స్పీడ్ పెరిగిందట. దీంతో ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందేనట. ఇదీ అంబటి పోస్టు సారాంశం.

52 నెలలుగా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజక వర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని జ‌గ‌న్ ఈ మీటింగ్‌లో వివరించారు. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: