తక్కువ ఖర్చుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలా?.. ఇలాంటి ప్రకటనలతోనే ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన కాళీ ప్రసాద్ రథ్ వ్యాపారం వందల మంది నిరుద్యోగులను మోసం చేశాడు. పోలీసులకు చిక్కాడు. ఇన్ఫోసిస్, ఐబీఎం, కాగ్నిజెంట్, టెక్ మహీంద్ర వంటి ప్రముఖ ఐటీ కంపెనీల పేర్లతో నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి నిరుద్యోగుల వివరాలను సేకరించి ఉద్యోగాలు ఇస్తామంటూ ఐటీ సంస్థల పేర్లతో మెయిళ్లు పంపిచి మోసం చేశాడు.
నిరుద్యోగ అభ్యర్థులు వచ్చిన మెయిళ్లు నిజమని నమ్మగానే వారి నుంచి స్కిల్ రిజిస్ట్రేషన్, ఆన్ బోర్డింగ్, లీగల్ డాక్యుమెంటేషన్, జీఎస్టీ తదితర పేర్లతో లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. కాళీ ప్రసాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పదుల సంఖ్యలో యువకుల్ని మోసం చేశాడు. 2022 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చారు. అజయ్‌కుమార్ అనే యువకుడి ఫిర్యాదుతో ఇతని బాగోతం బట్టబయలైంది.
మరింత సమాచారం తెలుసుకోండి: