రేవంత్ రెడ్డిపై ఎన్ని క్రిమినల్ కేసులున్నాయనే వివరాలను ఈనెల 16లోగా ఆయనకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తెలపాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఈనెల 3న డీజీపీకి ఈ విషయం పై వినతి పత్రం సమర్పించారు.


డీజీపీ తన వినతిపత్రంపై స్పందించడం లేదంటూ రేవంత్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. కేసులపై సమాచారం ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో నామినేషన్ ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 16లోగా రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  హోంశాఖ కార్యదర్శిని, డీజీపీని ఈ మేరకు ఆదేశించిన జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి విచారణను ఈనెల 17కి వాయిదా వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: