కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త వారి నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్ పంపింది. ఒక్కో పోస్టుకు మూడు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈసీకి పంపించారు. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు పోలీస్ కమిషనర్లు, పది మంది ఎస్పీ పోస్టుల కోసం ఈ ప్యానెల్ పంపారు. రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల కార్యదర్శులతో పాటు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల కమిషనర్ల పోస్టులకు కూడా పేర్లను సీఎస్‌ పంపారు.

ఈ పేర్లతో పాటు వారికి సంబంధించిన అన్ని వివరాలు, గత ఐదేళ్లుగా వారి పనితీరు, వార్షిక రహస్య నివేదికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎస్‌ పంపారు. వాటన్నింటిని పరిశీలించి ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని ఆయా పోస్టులకు ఈసీ ఎంపిక చేస్తుంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ అయిన అధికారులు సాధారణ పరిపాలనాశాఖలో రిపోర్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: