చైనాలో కొత్త సమస్య మొదలైంది. ఆ దేశంలో జననాల రేటు బాగా తగ్గుముఖం పడుతోంది. గతేడాది జననాలు మరో 10 శాతం క్షీణించాయని కొత్త లెక్కలు తేల్చాయి. 2022లో చైనాలో కేవలం 95.6 లక్షల మంది చిన్నారులే జన్మించారట. చైనా దేశంలో 1949 నుంచి నమోదవుతున్న రికార్డుల్లో అత్యల్ప జననాలు సంభవించిన ఏడాదిగా రికార్డు వచ్చింది.


కొత్తగా పెళ్లయిన జంటలు కేవలం ఒకరిని కంటే చాలని భావిస్తున్నాయి. మరికొందరు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. అందుకే గతేడాది చైనా జనాభా 1.41 బిలియన్ల వద్దే ఆగింది. చైనాలో వృద్ధ జనాభా పెరుగుతోంది. అందుకే ఆరోగ్యం, సంక్షేమంపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల ఆదాయం తగ్గుతోంది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదముంది. ఈ మొత్తం వ్యవహారానికి 1980 నుంచి 2015 దాకా ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనే కారణంగా చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: