తనపై బీఆర్‌ఎస్‌ నేతలు పోస్టర్లు వేయడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నేనేంటో కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు.. నాపై పోస్టర్స్ వేసినా పట్టించుకోను.. నాపై పోస్టర్ వేసారంటే కేసీఆర్ నా గూర్చి 24 గంటలు ఆలోచిస్తున్నాడని అర్థం అంటూ రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేశారు. నన్ను తిడితే పట్టించుకోనన్న రేవంత్ రెడ్డి .. పార్టీ పై విమర్శలు చేస్తే ఊరుకొనన్నారు. సీనియర్ అయినా, జూనియర్ అయినా పార్టీని, క్యాడర్ ని నష్టపరిస్తే ఊరుకొనని.. తానే పార్టీ అధ్యక్షుడిని కాబట్టి మంచైనా, చెడైనా నేనే భరించాలని రేవంత్ రెడ్డి అన్నారు.


ఏఐసీసీ నిర్ణయాలకు అనుగుణంగా నేను పనిచేయాల్సి ఉంటుందని.. ఆశించి టికెట్ రాని వాళ్ళకి బాధ ఉంటుందని.. పార్టీ సమిష్టిగా పని చేస్తుందని రేవంత్ రెడ్డి  అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమన్న రేవంత్ రెడ్డి.. మా మేనిఫెస్టో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిందని.. పూర్తి మేనిఫెస్టో త్వరలోనే వస్తుందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: