ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే.. పది నిమిషాలు పోలీసులు లేకుంటే హిందువుల సంగతేంటో చూస్తామన్న అసదుద్దీన్, అక్బరుద్దీన్ సంగతేంటో తేలుస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  అంటున్నారు. తెలంగాణను పరిపాలించింది కేసీఆర్ కుటుంబమన్న కిషన్ రెడ్డి.. బీ.అర్.ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట యమదూతలుగా మారిందన్నారు. ప్రవల్లికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని.. రైతులకు వెన్నుపోటు పొడిచిన మహా ఘనుడు కేసిఆర్ అని కిషన్ రెడ్డి అన్నారు.


ఏ ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదని..అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని.. రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం పోవాలన్నారు. కాంగ్రెస్ రావొద్దని..కాంగ్రెస్, బీ.అర్.ఎస్ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేర్చిన ఘనత కేసీఆర్ ది కాదు యువకులదే.. రాష్ట్ర ఏర్పాటు ఘనత యువకులకే దక్కుతుందన్న కిషన్ రెడ్డి .. 1984లో బీజేపీ కి రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిందని గుర్తు చేశారు. అప్పట్లో ఒకటి గుజరాత్ లో అయితే రెండోది తెలంగాణ నుంచే గెలిచిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP