కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్‌ చెప్పింది. డీఏ పెంపునకు కేబినెట్‌ ఆమోదం లభించింది. కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన కేంద్రమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌.. 2023 జులై 1 నుంచి 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతో 48.67 లక్షల కేంద్ర ఉద్యోగులు, 67.95 లక్షల పింఛనర్లకు లబ్ధి కలుగుతుంది. అలాగే 2024-25 ఏడాదికి 6 రబీ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం.. క్వింటా కందులకు మద్దతు ధర రూ.6,425కు పెంచింది. క్వింటా గోధుమల మద్దతు ధర రూ.2,275కు పెంచింది.


క్వింటా బార్లీ మద్దతు ధర రూ.1850కి పెంచింది. క్వింటా ఆవాల మద్దతు ధర రూ.5,650కి పెంచింది. క్వింటా పొద్దుతిరుగుడు మద్దతు ధర రూ.5800కి పెంచింది. యువత కోసం 'మై భారత్‌' పేరుతో సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. స్వయంప్రతిపత్తి గల సంస్థగా మేరా యువ భారత్ సంస్థ పని చేయనుంది. అలాగే రైల్వే ఉద్యోగులకు రూ.1968.87 కోట్ల పీఎల్‌బీకి ఆమోదం లభించింది. 2022-23 ఏడాదికి 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీకి ఆమోదం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

DA