రాజకీయ పార్టీలు మాలలకు 12 నుండి 14 సీట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ డిమాండ్ చేశారు. అతి త్వరలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో మాలలకు అన్ని రాజకీయ పార్టీలు మాలల జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని చెరుకు రామచందర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాలలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఈ 10 ఏళ్లలో మాలలకు ఒరిగిందేమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


మహిళలు ఆర్థిక రాజకీయ సామాజికంగా వెనుకబడ్డారని చెరుకు రామచందర్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు మాలలకు ఏమాత్రం అందడం లేదని.. అన్ని రాజకీయ పార్టీలు మాలలకు తగిన ప్రాధాన్యత కల్పించని పక్షంలో ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని చెరుకు రామచందర్ స్పష్టం చేశారు.  మాలలు ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెరుకు రామచందర్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: