తెలంగాణ అబ్కారీ శాఖ మద్యం నిల్వలపై కొరడా ఝులిపిస్తోంది. నిన్న ఒక్క రోజే కోటి 43 లక్షలు రూపాయిలు విలువైన 15,580 లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. నల్గొండ ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో రూ. 17.16లక్షలు విలువైన 1560 లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. నిర్మల్‌ ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో రూ.13.25 లక్షలు విలువైన 1876 లీటర్లు, హైదరాబాద్‌ అబ్కారీ జిల్లా పరిధిలో రూ.18.77లక్షలు విలువైన 2369 లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.


అటు రంగారెడ్డి ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో రూ. 63.07లక్షలు విలువైన 5998 లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. మేడ్చల్‌ ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో రూ.30.56లక్షలు విలువైన 3777 లీటర్లు నిల్వ ఉంచిన మద్యాన్నిసీజ్‌ చేసినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు రూ. 8.70 కోట్లు విలువైన 2.5లక్షలు లీటర్లు మద్యం, 560 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోటిన్నర విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: