అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఖమ్మం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను కలిసిన భాజపా నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ మేరకు ఇద్దరు అధికారులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రి సత్తుపల్లి పర్యటన ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఖరారు అయిందని... ఆ కార్యక్రమం సాయంత్రం జరిగితే దాన్ని ఉదయం జరిగినట్లు చిత్రీకరిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.


గ్రీన్ ఫీల్డ్ హైవే సాకుతో ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు నోటీసులు ఇచ్చారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. అధికారులు ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో కలెక్టర్లు, అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెడుతున్నారన్న శశిధర్ రెడ్డి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కలెక్టర్, ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP