ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం ఏపీలో  4 కోట్ల 02 లక్షల 21 వేల 450 ఓటర్లు నమోదు అయ్యారు. వీరిలో మహిళా ఓటర్ల సంఖ్య 2 కోట్ల 03 లక్షల 85 వేల 851. పురుష ఓటర్ల సంఖ్య 1 కోటీ 98 లక్షల 31 వేల 791గా నమోదైంది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. ఇక సర్వీసు ఓటర్ల సంఖ్య 68,158గా ఎన్నికల కమిషన్ పేర్కోంది.  


ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 18-19 సంవత్సరాల వయస్సున్న 2 లక్షల 88వేల,155 మంది యువ ఓటర్లు నమోదు అయ్యారు. 2023 జనవరి 5 తేదీ తర్వాత రాష్ట్రంలో ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య 15,84,789 ఉంది. ముసాయిదా జాబితాలో అభ్యంతరాలను డిసెంబరు 9 తేదీ వరకూ స్వీకరిస్తామని ఈసీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: