ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతోనూ తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ముసాయిదా జాబితాను ఆయా పార్టీల ప్రతినిధులకు ఇచ్చింది. అయితే.. వైసీపీ నేతలు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎన్నికల ప్రధానాధికారికి కంప్లయింట్‌ చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల పరిధిలో దొంగఓట్లు చేర్చేందుకు స్థానిక అధికార పార్టీ ప్రతనిధులు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ ఆరోపించింది.


ఒకే వ్యక్తి మూడు, నాలుగు నియోజకవర్గాల్లో ఓట్లేసేలా జాబితాని సిద్దం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల  రామయ్య ఆరోపించారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు తెలిపారు. పర్చూరులో సీఐ, ఎస్సైలు డేటా చౌర్యం చేశారని ఆ తర్వాత సస్పెండయ్యారని టీడీపీ నేత వర్ల  రామయ్య  అన్నారు. పర్చూరు సీఐ సహా ముగ్గురు ఎస్ఐలపై డేటా చౌర్యం చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: