ఏపీలో ఓటర్ల జాబితా ముసాయిదా రెడీ అయ్యింది. ఈ మేరకు ఈసీ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చింది. సచివాలయంలో అన్ని పార్టీల నేతలకూ ముసాయిదా జాబితాను అందించిన సీఈఓ డిసెంబరు 9 తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించింది. అలాగే జిల్లాల వారీగానూ రాజకీయ పార్టీలకు ఓటర్ల ముసాయిదా జాబితాను అందిస్తామని కమిషన్‌ స్పష్టం చేసింది.

అయితే.. యువత మరింతగా ఓట్లను నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని సీపీఎం పార్టీ కోరింది. కొందరు అధికారులు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని సీపీఎం పార్టీ నేత వైవీ రావు ఆక్షేపించారు. ఈసీ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీపీఎం పార్టీ నేత వైవీ రావు  డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికలు ముగిశాక చాలా మంది ఏపీలో ఓట్లు నమోదు చేసుకుంటారని .. ఈ విషయంలో ఈ విషయంలో జాగ్రత్త పడాలని సీపీఎం పార్టీ నేత వైవీ రావు  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP