ఐ ఫోన్‌ ప్రేమికులకు శుభవార్త. ఇక ఐఫోన్‌ మరింత తక్కువ ధరకు అందుబాటులోకి రాబోతోంది. ఎందుకంటే.. ఐ ఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్‌ అవతరించింది. తైవాన్‌ సంస్థ విస్ట్రాన్‌తో 125 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఇక మరో రెండున్నరేళ్లలో టాటా తయారు చేసే ఐఫోన్లను దేశ, విదేశాల్లో విక్రయిస్తారు.  ఐఫోన్ల తయారీలోకి అడుగుపెట్టాలని నిర్ణయించిన టాటా గ్రూప్‌ కొన్నాళ్లుగా విస్ట్రన్‌ కార్ప్‌తో చర్చలు జరిపింది. తాజాగా విస్ట్రాన్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో.. టాటా కొనుగోలు ఆఫర్‌కు ఆమోదం లభించింది.

కర్ణాటకలోని విస్ట్రాన్‌ ప్లాంట్‌లో 100శాతం వాటాలను టాటా ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది.125 మిలియన్‌ డాలర్లకు ఈ ఒప్పందం కుదిరింది. ఐఫోన్లను తయారుచేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్‌ అవతరించిందని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: