పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. కల్వకుంట్ల స్కామేశ్వరంలో మరో మైలురాయి అంటూ నిన్న మేడిగడ్డ బ్యారేజీ... నేడు అన్నారం బ్యారేజీ... అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు... అంటూ సోషల్ మీడియాలో ఆక్షేపించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మాణం చేపట్టిన బ్యారేజీ వద్ద బుంగ పడినట్లు తాజాగా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. 4వ బ్లాక్‌లోని 41వ పిల్లర్ అడుగు నుంచి వాటర్ లీకవుతున్నాయి.
వాటిని సవరించేందుకు రాళ్లు వేస్తున్న నేపథ్యంలో రేవంత్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. సాగు నీటి ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్‌కు ప్రహరీ గోడ అనుకున్నావో... నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో... అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.