సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. ఇప్పటికే రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొంటున్న ఆయన.. మరో 54 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచార షెడ్యూలు ఖరారైంది. దీని ప్రకారం ఈనెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈనెల 25న హైదరాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈనెల 28న గజ్వేల్ లో కేసీఆర్ ప్రచారం ముగిస్తారు.

ఇవాళ్టి వరకు 30 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించిన కేసీఆర్.. ఈనెల 9 వరకు మరో 12 సభలు నిర్వహించబోతున్నారు. ఈనెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్లకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. సిద్దిపేటలోని కోనాయపల్లి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అంటే ఇకపై కేసీఆర్ ఇంకా జోరు పెంచుతారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: