రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి సీవిజిల్ యాప్ ద్వారా 3, 205 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 1961 ఫిర్యాదులు సరైనవిగా గుర్తించారు. ప్రజలు సీవిజిల్ యాప్ ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సీఈఓ వికాస్ రాజు విజ్ఞప్తి చేశారు. గుర్తుల కేటాయింపు, పోలింగ్ ఏజెంట్లకు సీటింగ్ అరేంజ్ మెంట్, మాక్ పోలింగ్, టెండర్ ఓట్, చాలెంజ్ డ్ ఓట్, పోస్టల్ బ్యాలెట్, భద్రతా ఏర్పాట్లు తదితరాలను ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ వికాస్ రాజు అధికారులకు వివరించారు.


నామినేషన్లు దాఖలు చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీ మార్గదర్శకాలు, నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకంగా, ప్రశాంతంగా ప్రక్రియ జరిగేలా రిటర్నింగ్ అధికారులకు సహకరించాలని సీఈఓ వికాస్ రాజ్ అంటున్నారు. పార్టీలు అభ్యర్థులు ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని సీఈఓ వికాస్ రాజు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: