బీఆర్ఎస్‌ ను మూడోసారి ఎన్నికల్లో గెలిపించేందుకు కేటీఆర్‌ ఈసారి చాలా కష్టపడుతున్నారు. గతం కంటే భిన్నంగా అన్ని ఛానళ్లకు, ప్రముఖ యూట్యూబర్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంతే కాదు.. వివిధ సంఘాల మీటింగులకు వెళ్లి మళ్లీ బీఆర్ఎస్‌నే గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల ప్రచారం ఎలాగూ ఉంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో రైతుబంధు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే.. రైతుబంధుపై పరిమితి విధించే ప్రయత్నం చేస్తామన్నారు.

అయితే.. రెండు ఎకరాలు ఉన్నవాడు.. పదెకరాలు ఉన్న వాడికి వచ్చే రైతుబంధు సొమ్ము చూసి ఏడుస్తున్నారని కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. వందల ఎకరాలు ఉన్నవారికి అప్పనంగా ప్రభుత్వ సొమ్ము రైతుబంధు పేరిట కట్టబెడుతూ.. మళ్లీ దాన్ని సమర్థించుకోవడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మాటల ద్వారా కేటీఆర్‌ తన దొరతనాన్ని ప్రదర్శించారంటూ ఓ మహిళా జర్నలిస్టు చేసిన యూట్యూబ్‌ వీడియో వైరల్‌గా మారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

KTR