హైదరాబాద్‌ గన్ పార్క్ వద్ద నుంచి నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రను  ప్రొఫెసర్ హరగోపాల్, ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జ్‌ డాక్టర్ అజయ్ కుమార్ కలిసిప్రారంభించారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలోపదేళ్ లపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూడటం శోచనీయమని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. యాత్రలో భాగంగా రెండు బస్సులు 10 రోజులపాటు 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తాయి. 

నిరుద్యోగులను, జనాలను చైతన్య పరిచే విధంగా సాగుతాయి. నిరుద్యోగుల గోస చూసి ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ప్రొఫెసర్ హర గోపాల్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జ్‌ అజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి దయాకర్, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, ఇతర నేతలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: