తెలంగాణలో ధరణి పేరుతో భారీ భూకుంభ కోణం జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ స్కామ్ కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దదని ఆ పార్టీ రాష్ర్ట ఎన్నికల ఇంచార్జ్‌ ప్రకాశ్‌ జవదేకర్‌ అంటున్నారు. తెలంగాణ ప్రజలకు భారాస ప్రభుత్వ చేసిన అతిపెద్ద మోసం ధరణి అని ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. దీని ద్వారా లక్షల మంది రైతులు తమ విలువైన భూమిని కోల్పోయారని ప్రకాశ్‌ జవదేకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ధరణిని సర్వరోగ నివారిణి అని గొప్పగా ప్రచారం చేసుకుంటోందని.. గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సిన వీఆర్వోల వ్యవస్థను లేకుండా చేశారని ప్రకాశ్‌ జవదేకర్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఇక కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓట్లు పొందాలనే తప్ప ఆ పార్టీ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భారాస, కాంగ్రెస్ దోపిడీ చేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను ఆలస్యంగా ఇవ్వడం వల్లే ఆత్మబలిదానాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం చెబుతున్నారని.. తెలంగాణ ఇస్తానని వెనకడుగు వేయడంతో.. 12వందల మందిని పొట్టన పెట్టుకున్నారని కిషన్ రెడ్డి  ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: