ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. భాజపా అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌లో మారుస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ యూపీ సీఎం వచ్చి పులిసిపోయిన డైలాగ్‌ చెప్పారని ఎద్దేవా చేశారు. భాగ్యనగర్ పేరు మార్చడం కాని పని పేర్కొన్న అసద్‌.. రిజర్వేషన్‌ తీసేస్తామని అమిత్ షా చెప్పారని ఈ రెండు ఎప్పుడు మీకు కలగానే మిగిలిపోతాయన్నారు.


అయితే తెలంగాణ ప్రజలను ఎంఐఎం, భారాస, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి మోసం చేస్తున్నాయంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని  కర్మన్‌ఘాట్ లో ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజలను భారాస మోసం చేస్తోందని.. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, బిజెపి ప్రభుత్వం రావాలని యోగి ఆదిత్యనాథ్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: