అసెంబ్లీ ఎన్నికల కోసం కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. స్థానిక పోలీసులతో పాటు 40 కంపనీలకు చెందిన పారామిలటరి బలగాలు విధుల్లో ఉన్నాయని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకూ 63కోట్లు విలువ చేసే నగదు, లిక్కర్, ఆభరణాలు సీజ్ చేశామని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. ఇప్పటి వరకూ లైసెన్స్ కలిగిన అన్ని వెపన్స్ డిపాజిట్ అయ్యాయని సీపీ సందీప్ శాండిల్య వివరించారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7జోన్లలో 1600 మందిపై రౌడీషీట్లు ఉన్నాయి. వారిపై ప్రత్యేక నిఘాపెట్టారు. గత పది రోజుల్లోనే 2.50లక్షల వాహానలు తనిఖీ చేశామని సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం1700 పోలింగ్ ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో 4919 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. వీటిలో 666 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: