హైదరాబాద్‌ పరిసరాల్లో భారీ ల్యాండ్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి కలెక్టరేట్‌లోని ధరిణి వెబ్‌సైట్‌లో భారీ అక్రమాలు జరిగాయి. దీనిపై ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎవరెవరి దరఖాస్తులకు ఆమోదముద్ర పడిందో వాళ్లందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ధరణి వెబ్‌సైట్‌లో ఉన్న ధరఖాస్తుల్లో కొన్నింటికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చినట్లు  ఇటీవల గుర్తించారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి పరిమళా రాణి ఫిర్యాదు చేశారు. ఆదిబట్ల పోలీసులు 5వ తేదీన కేసు నమోదు చేశారు. అయితే వివరాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


ఇప్పుడు పోలీలులు ఎవరెవరిని భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయనే వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 98 దరఖాస్తులను కలెక్టర్‌ అనుమతులు లేకుండానే క్లియర్ చేసినట్లు గుర్తించారు. ఇందులో కోర్టు కేసుల్లో ఉన్న భూములు, పాస్‌బుక్‌లో మార్పులు, పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లు, నిషేధిత భూములకు ధరణి వెబ్‌సైట్‌లో క్లియరెన్స్ ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: