తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన మార్కు చూపించాలనుకుంటున్నారు. దిల్లీలో పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు నిర్మించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న స్పీకర్‌ పదవి కోసం గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణం అంతా కలియతిరిగారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులతో కలిసి కాలినడకన తిరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అన్ని భవనాలను పరిశీలించారు.


అసెంబ్లీ మొత్తం విస్తీర్ణం ఎంత.. ఏమేం కట్టడాలు ఉన్నాయి.. అందులో పురాతన భవనాలు ఏమి ఉన్నాయి.. కొత్తగా నిర్మితమైనవి ఏమున్నాయి తదితర వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. కలగూర గంపగా ఉన్న అసెంబ్లీ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. శాసనసభ, మండలి రెండూ ఒకే చోట ఉండేట్లు నిర్మాణాలు ఉండాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుసుకునేట్లు ఉండాలని రేవంత్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: