డిసెంబర్ 21 తేదీ న సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని 8 తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదాన్ని తెలియచేసింది. 4.35 లక్షల మంది విద్యార్ధులకు ఈ ట్యాబ్ లను పంపిణీ చేయనున్నారు. అలాగే విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగానూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ను కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్ లు పంపిణీ చేస్తారు.

ఇక జనవరి 10 నుంచి 23 వరకూ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు 4 విడతగా రుణ మాఫీ అమలుకు సంబంధించి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.6,394 కోట్ల ఆర్థిక సాయం పంపిణీకి ఆమోదం తెలిపింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకూ వై ఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 చొప్పున ఆర్ధిక సాయం జమ చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జనవరి 1 నుంచి  వృధ్యాప్య పెన్షన్ రూ.3000 కు పెంపుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: