తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలోని ఉమ్మడి ఏపీ ఆస్తులపై ఆరా తీశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం దిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణకు రావాల్సిన భూములపై ఆరా తీశారు. మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు 41.68:58.32 నిష్పత్తిలో వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.

మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని అధికారులు తెలిపారు. వాటికి మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.. ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: