లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా.. యువగళం - నవశకం పేరిట ఇవాళ టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు 'యువగళం-నవశకం' సభ ఉంటుంది. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా సాగిన లోకేష్‌ యాత్ర సాగిందని.. పాదయాత్రలో మొత్తం 3,132 కి.మీ. నారా లోకేష్‌ నడిచారని టీడీపీ చెబుతోంది. ఈ సభ ద్వారా సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించనున్న టీడీపీ- జనసేన.. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వేదికగా సభ నిర్వహిస్తోంది.

ఈ సభకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, బాలకృష్ణ రాబోతున్నారు. ఈ సభ ద్వారా పదేళ్ల తర్వాత ఒకే బహిరంగ వేదికపైకి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కనిపించబోతున్నారు. ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సభకు 6 లక్షల మందికి పైగా జనాలు వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: