సీఎం రేవంత్‌ రెడ్డి మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు రేవంత్‌ ప్రభుత్వం కొత్తగా ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహిస్తారు. ప్రజల సమస్యలను నేరుగా విని.. అక్కడికక్కడే పరిష్కరించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. వీటిలో చాలా దరఖాస్తులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవే. అందుకే ఈ కొత్త కార్యక్రమం రూపొందించారు. అయితే ఈ కార్యక్రమం ఎలా అమలు చేయాలనే అంశంపై రేపు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. గ్రామ, మండల స్థాయుల్లో సమస్యలకు నేరుగా పరిష్కారం చూపించే ఈ కార్యక్రమం సరిగ్గా నిర్వహిస్తే ప్రజల సమస్యలు చాలా వరకూ పరిష్కారం అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: