సోషల్ మీడియాలో వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా సమాజంలో అలజడి సృష్టించాలని ప్రయత్నించేవారిని.. అనసర వివాదాలకు ఆస్కారం కల్పించేవారిని దారికి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారును ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్ గా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ నేరాల తీరు మారి ఇప్పుడు సైబర్ నేరాల వైపునకు వెళ్లాయన్న సీఎం రేవంత్ రెడ్డి.. సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయాలని పోలీసులను ఆదేశించారు.

నకిలీ విత్తనాలు టెర్రరిజం కన్నా ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతు ఆత్మహత్యలు పెరగడంలో నకిలీ విత్తనాలు ప్రధాన కారణమని.. నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని.. కంపెనీల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: