మాదకద్ర్యవాల్లో కొకైన్‌ కంటే ప్రమాదకరమైన ఆల్ఫాజోలం డ్రగ్‌ విరివిగా లభిస్తోంది. ఇది కోకైన్ కంటే ప్రమాదకరమని, దీన్ని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిఎస్‌ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందని.. ఇటీవల 3.14 కోట్లు విలువ చేసే 31.42 కిలోల ఆల్ఫజోలం ను నాగర్ కర్నూల్ జిల్లా బిజినే పల్లిలో పట్టుకున్నామని ఆయన తెలిపారు.

ఈ సమాచారం ఆధారంగా టిఎస్‌న్యాబ్ పోలీసులు రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిన్నారం లోని మూతపడిన పరిశ్రమలో 14కిలోల నార్డజెపమ్ డ్రగ్ పట్టుకున్నారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10కిలోల ఆల్ఫజోలం స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పరమేశ్వరా కెమికల్స్ ఎండి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఈ డ్రగ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: