కాంగ్రెస్ పార్టీ బూతుస్థాయి ఏజెంట్ల సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగుతుంది. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ బిఎల్‌ఎల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వస్తారు. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 36వేల మంది బూతుస్థాయి ఏజంట్లు, నియోజక వర్గ ఇంఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజక వర్గ ఇంఛార్జిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరవుతారు.

ముఖ్యమంత్రితోపాటు మంత్రులు ఖర్గే పాల్గొంటున్న సమావేశం అందుకే ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు.  స్టేడియంలో జరుగుతున్నఏర్పాట్లను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తదితరులు పరిశీలించారు. పరిమిత సంఖ్యలో హాజరవుతున్న ఈ సమావేశంలో.. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గేతోపాటు సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు దిశానిర్దేశం చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: