కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టేనా.. అవునంటున్నారు వామపక్షాల నేతలు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తానంటున్నాడు కానీ గత పదేళ్లలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేసేలా ఇండియా కూటమితో చర్చలు జరుపుతున్నట్లు డి. రాజా వెల్లడించారు. అందుకు సంబంధించి కమిటీ కూడా వేసినట్లు డి. రాజా వెల్లడించారు.


వేల కోట్ల అవినీతి చేసిన జగన్‌ లాంటి అవినీతి పరుడు సుఖంగా ఉండడం, జార్ఖండ్‌ మాజీ సీఎం ఈడీ విచారణలో ఉండడానికి కారణం బీజేపీనే కారణమని మరో సీపీఐ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మోదీ పార్లమెంట్‌లో ప్రతిపక్షం ఉండకుండా చేయాలనుకుంటున్నారన్న వామపక్ష నేతలు.. అడ్వాణీకి భారతరత్న ఇవ్వడాన్ని తప్పుబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: