చంద్రబాబు వయసు 75 ఏళ్లు వచ్చినా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతున్నా.. చంద్రబాబు మొదటిసారి సీఎం అయి దాదాపు 30 ఏళ్లు అవుతున్నా.. మూడు సార్లు సీఎం అయినా.. ఇన్నేళ్ల తరువాత కూడా ఇంకా ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటు వేయమని అడిగే దమ్ము లేదట.. ఈ మాట అంటున్నది ఏపీ సీఎం జగన్.. ఇన్నేళ్ల తరువాత కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా లేదని సీఎం జగన్ అంటున్నారు.


ఇప్పటికీ చంద్రబాబు పేరు చెబితే ఈ రోజుకు గుర్తుకు వచ్చేది వెన్నుపోటేనట. ఎన్టీఆర్, ప్రజలను వెన్నుపోటు పొడిచింది ఎవరు అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు పేరేనని సీఎం జగన్ అంటున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో వందల హామీలు ఇస్తారని.. ఎన్నికల తరువాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని సీఎం జగన్ విమర్శిస్తున్నారు. మరోసారి అలాంటి అబద్ధాలు,మోసాలతో మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని.. జనం జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: