కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ కూడా.. అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని.. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని.. మరి రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

అనేక వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలన్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవి నీటిమీద రాతలేనా అని నిలదీసారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ.. ఇక అమలు కానట్టేనని.. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని.. రైతుల కోసం వరంగల్ లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కిషన్ రెడ్డి విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: