హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం కేసు చివరకు ఓ సీనియర్ ఐఏఎస్‌ అధికారి మెడకు చుట్టుకుంటోంది. దీనిపైపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. కస్టడీ విచారణలో శివ బాలకృష్ణ సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌ కుమార్ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ సీనియర్ ఐఏఎస్‌ను విచారించేందుకు ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు.

న్యాయ సలహా తీసుకుని నోటీసులు జారీకి సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు.. సీనియర్‌ ఐఏఎస్ ఆదేశాలతో శివ బాలకృష్ణ అక్రమంగా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. అనేక ప్రాజెక్టులకు అనుమతులిచ్చిన శివ బాలకృష్ణ కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని కస్టడీ సమయంలో శివ బాలకృష్ణ చెప్పాడు. ఐఏఎస్‌ అధికారిపై కేసు విచారణకు ప్రభుత్వ అనుమతి తీసుకోనున్న ఏసీబీ అధికారులు.. ఐఏఎస్ అధికారి, శివబాలకృష్ణ మధ్య వాట్సాప్ సందేశాలు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు విశ్లేషిస్తున్నారు. 161 కింద ఐఏఎస్‌కు నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

acb