హరీష్‌రావు తనతోపాటు 25మంది ఎమ్మెల్యేలను తీసుకుని వస్తే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామంటున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. హరీశ్‌రావుకు దేవాదాయ శాఖ ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌లో చేసిన పాపాలను కడుక్కొవడానికి ఆ మంత్రి పదవి ఉపయోగపడుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కడియం శ్రీహరి తమను చీల్చాలని గుంటకాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

హరీష్‌రావు,కడియం శ్రీహరి మాదిరిగా మేము జీ హుజూర్ బ్యాచ్‌ కాదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  బీఆర్‌ఎస్‌ చీప్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. హరీష్‌రావును తమ పార్టీలోకి రమ్మంటున్నామని అక్కడ అతనికి భవిష్యత్‌ లేదని తెలిపారు. హరీష్‌రావు రైట్ పర్సన్‌ ఇన్ రాంగ్ పార్టీ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: