కర్నూలులో ఈనాడు ఆఫీసుపై దాడి జరిగింది. ఎమ్మెల్యే కాటసాని అనుచరులు కర్నూలు ఆఫీసుపై దాడి చేశారు. తమ ఎమ్మెల్యేపై తప్పుడు వార్తలు రాశారంటూ వారు దాడికి దిగారు. ఈనాడు ఆఫీసుపై రాళ్లు విసిరారు. ఈ దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కర్నూలు ఈనాడు కార్యాలయంపై అధికార వైకాపా మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్న చంద్రబాబు.. రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రులకు ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించిన జగన్, తన అనుచరుల్ని ఈ విధంగా దాడులకు రెచ్చకొడుతున్నాడని చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నమేనన్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ హింసాత్మక చర్యలకు మరో 50రోజుల్లో ముగింపు పలుకుతామన్న చంద్రబాబు.. ఇటీవల ఆంధ్రజ్యోతి, టీవీ5 అనుచరులపై  జరిగిన అనాగారిక దాడుల్ని అనుసరించే ఈనాడు కార్యాలయంపైనా దాడి జరిగిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: