ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పే మోదీ చండీఘర్‌ మేయర్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రిటర్నింగ్ అధికారి చేసిన నిర్వాకంపై ఎందుకు నోరు మెదపట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ ఘటన భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని తెలంగాణ పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ఆరోపించారు. బీజేపీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందనేందుకు చంఢీఘర్‌ ఘటన నిదర్శనంగా చెప్పొచ్చని నిరంజన్‌ అన్నారు. ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పే మోదీ దీనిపై స్పందించి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నిరంజన్‌ డిమాండ్‌ చేశారు.


భారతదేశ చరిత్రలో మొదటిసారి సుప్రీంకోర్టు సమక్షంలో కోర్టు హాలులో ఓట్ల లెక్కింపు జరిగిందన్న నిరంజన్‌ దారుణమైన మోసాన్ని, నిజాలను కోర్టు బయట పెట్టిందన్నారు. రాబోయే లోకసభ ఎన్నికల్లో ఏ రకమైన మోసాలు చెయ్యబోతున్నారో అనేదానికి ఇదొక నిదర్శనమని నిరంజన్‌ పేర్కొన్నారు. కుళ్లు, కుతంత్రంతో కూడిన తన వ్యూహం, తనకు ఉన్నది కాబట్టే, మూడో సారి తానే వస్తానని, ఎన్‌డీఏకు 400 సీట్లు వస్తాయని మోదీ బల్లగుద్ది మరీ చెపుతున్నారని ఆయన విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: