పార్ట్ టైం ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు ఈ సైబర్ నేరగాళ్లకు ఖాతాలు సమకూరుస్తూ సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లో అలా సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళలో జానీ, మనువల్ లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మూడు పెన్‌డ్రైవ్ లు, 7 పాస్ బుక్ లు, 33చెక్ బుక్స్, 25డెబిట్ కార్డులు, 5 మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు.
 
టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నగరానికి చెందిన బాధితురాలిని నిందితులు మోసం చేశారు. వాట్సాప్ లో ఆమెకు పరిచయం అయిన దుబాయ్ కి చెందిన రైసుల్.. ఆమెను టెలిగ్రామ్ యాప్ లోని ఓ గ్రూప్ లో యాడ్ చేశాడు. క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేయించి ఆమెతో 49.45లక్షలు జానీ, మనువల్ ల ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఇందుకు జానీ, మనువల్ కు రైసుల్  3శాతం కమిషన్ ఇచ్చాడు. దేశ వ్యాప్తంగా జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాలపై 50కి పైగా నేరాల్లో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: