రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మరో గ్యారంటీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనుంది. ఆరు గ్యారంటీల్లోని 13 పథకాల్లో ఇప్పటికే నాలుగింటిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇళ్లు లేని నిరుపేదలకు స్థలం, 5 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు.


అయితే ఈ ఇళ్లు అందరికీ రావు.. మొదటి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరదు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిబంధనలను అధికారులు వెల్లడించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: