ప్రశాంత్‌ కిషోర్‌. దేశంలోనే పేరున్న ఎన్నికల స్ట్రాటజిస్టు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేసిన వాడు.. తమిళనాడులో స్టాలిన్‌ను, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని గెలిపించిన వాడుగా దేశంలోనే పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జగన్ రాజకీయ భవిష్యత్‌ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నాడని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని.. జగన్‌ భారీ అపజయాన్ని మూట కట్టుకోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. గత ఎన్నికల్లో జగన్‌ కోసమే పని చేసిన వ్యక్తి కావడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ వ్యాఖ్యలపట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ ఎన్నికల జోస్యం ఎంత వరకూ నిజం అవుతుందో కొన్ని నెలల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk