రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించుకున్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందే‍శ్వరి.. టీడీపీతో పొత్తులపై స్పందించారు. రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి రెండు రోజుల్లో ఎలాంటి చర్చ జరగలేదన్న పురందే‍శ్వరి.. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించుకున్నామని, సమీక్షించుకున్నామని తెలిపారు. 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశామన్న పురందే‍శ్వరి.. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించామన్నారు.


సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తామన్న పురందే‍శ్వరి.. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారని.. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదేనని తెలిపారు. 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు వచ్చాయన్న పురందే‍శ్వరి.. జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామన్నారు. మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp