హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి కొత్త మామిడి పండ్లు వచ్చేస్తున్నాయ్.. రంగారెడ్ది జిల్లా బాటసింగారంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో మామిడి సీజన్ ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుండి మామిడికాయలు రోజుకు 50 నుంచి 75 వాహనాలలో మామిడికాయ వస్తున్నాయి. అందుకు  తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. పండ్లు మాగేందుకు వాడే రసాయనాలపై ముందుగానే మార్కెట్ అధికారులు ఏజెంట్లకు అవగాహాన కల్పించామంటున్నారు.


అయితే పండ్లు పండేందుకు వేసే రసాయనాలతో ఏజెంట్లకు  కొంత గందరగోళం జరుగుతోంది. గుర్తింపు లేని వాటిని, మోతాదుకు మించి పండ్లు మగ్గేందుకు రసాయనాలను వాడుతున్నారని కొన్ని కంపెనీలే యజమానులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సెక్యూరిటీ నుండి అనుమతి పొందిన కంపెనీల రసాయనాలను మాత్రమే వాడటానికి అనుమతించినట్లు, ఎవరైనా ఫుడ్ సెక్యూరిటీ నియమనిబంధనలకు విరుద్ధంగా వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: