అధికారం ఉన్నచోటే రాజకీయ నేతలు ఉంటుంటారు. అధికారంపోయిందంటే నేతల తీరులోనూ మార్పు వస్తోంది. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో తిరుగులేని బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు నేతల వలస ఓ గండంగా మారింది. పార్టీ నుంచి నేతలు వరుసగా అధికార పార్టీలోకి వెళ్తున్నారు. దీనిపై కేసీఆర్ కూడా స్పందించారు. అవకాశవాదులు వస్తుంటారు, పోతుంటారంటున్న కేసీఆర్‌.. ప్రజల్లో ఉండాలి కానీ, గెలుపు ఓటములు ముఖ్యం కాదని అంటున్నారు.


అయితే.. కష్టకాలంలో పార్టీని వీడుతున్న వారిని మళ్లీ పార్టీలో చేర్చుకోవద్దని పలువురు నేతలు కేసీఆర్‌ను కోరారు. ఇప్పుడు పార్టీ వదిలి వెళ్తున్నవారిని మళ్లీ తీసుకునే ప్రసక్తి లేదని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. సమావేశం అనంతరం ఆయన పేరును ప్రకటించారు. నాగర్ కర్నూల్ అభ్యర్థి విషయంలో తనకు రెండు రోజులు సమయం ఇవ్వాలని, నిర్ణయం ప్రకటిస్తానని కేసీఆర్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: