రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలను చేపడుతున్నారు. దీన్ని కేసీఆర్ తప్పుబడుతున్నారు. పాలమూరు - రంగారెడ్డి కాల్వలు పూర్తి చేసి నీరు ఇవ్వాల్సింది పోయి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ఎందుకు చేపడుతున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అధినేత ప్రశ్నించారు. జూరాల నుంచి నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల అనాలోచిత చర్యగా కేసీఆర్ అభివర్ణించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోందని, వంద రోజులు కాకముందే వ్యతిరేకత చవిచూస్తోందని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రెండు లోక్ సభ స్థానాల పరిధిలోని నేతలతో ఆయన సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి తాను తెలంగాణ సాధించానని, ప్రభుత్వంలో ఉండి పాలమూరుకు ఎంతో చేశామని కేసీఆర్ వివరించారు. నీరు, సాగు లేక బండలా ఉన్న పాలమూరును సస్యశ్యామలం చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఓడిపోవాల్సింది కాదని కేసీఆర్  అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: