ఇటీవల ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం రేవంత్ సాదరంగా ఆహ్వానించారు. పెద్దన్న అంటూ సంబోధించారు. అయితే.. అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నమ్మానని.. మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదని.. దేశ ప్రధాని కాబట్టి మర్యాద ఇచ్చామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే సమయంలో మనం అడిగిన పనులు చేయకపోతే మోదీకైనా చాకిరేవు పెడతానని తేల్చి చెప్పారు.

అంతే కాదు.. రాష్ట్రాభివృద్ధికి మోదీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానంటున్నారు రేవంత్ రెడ్డి. మన మంచితనం చేయకానితనం కాదని.. కేంద్రం, రాష్ట్రం మధ్య ఘర్షణ మంచిది కాదనే వినతి పత్రాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. పదవులు కాదు.. కార్యకర్తలే శాశ్వతం అని నేతలకు తరచూ చెబుతూఉంటానన్న రేవంత్ రెడ్డి.. అప్పట్లో పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును నెహ్రూ ముఖ్యమంత్రిని చేశారని..
తెలంగాణ ప్రజల కష్టాలు తొలగించేందుకు సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: