సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కకు పెట్టేస్తున్నారా.. ఆయన ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారా.. అధికారంలోకి వచ్చిన మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చక్కటి ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతి ప్రభుత్వ పథకం ప్రచారంలోనూ అటు రేవంత్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క ఫోటోలు ఉండేవి. గతంలో ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్, భట్టికి హైకమాండ్ సమాన ప్రాధాన్యం ఇచ్చింది.


అధికారం వచ్చిన మొదట్లో కాస్త మంచి ప్రాధాన్యమే ఇచ్చినా.. ఆ తర్వాత క్రమంగా భట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి పక్కకు పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో ఇప్పుడు భట్టి ఫోటోలు కనిపించట్లేదు. ప్రభుత్వ ప్రకటనల్లోనూ భట్టి ఫోటోలు కనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడినే ఫోకస్‌ చేస్తున్న ఫోటోలు పెడుతున్నారు. మరి ఇది ఉద్దేశపూర్వకమా.. లేక అధికారులు చేసిన పొరపాటా అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: