హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం ఇస్తామంటున్నారు కాంగ్రెస్ మంత్రులు.. తమది మాది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షో 2024 కార్యక్రమంలో చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మా ప్రభుత్వము మంచి నాయకత్వంలో నడుస్తోందని.. మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని..  అందరూ అభివృద్ది చెందటానికి మా ప్రభుత్వము సహకరిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

హైదరాబద్ లో ఉన్నా త్రాగు నీరు సమస్యను సీరియస్ గా తీసుకుని పరిష్కరిస్తామని.. సిటీ లొ ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉందని.. దీనికోసమే మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను అభివృద్ధి చేస్తాము. వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: