సినీ నటి సౌమ్య జాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బంజారా హిల్స్‌ పీఎస్‌లో తనపై నమోదైన కేసులో పోలీసులు  తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ సౌమ్య హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గత వారం కారును రాంగ్ రూట్‌లో నడుపుతు ప్రధాన రహదారిపై వస్తున్న సినీ నటి సౌమ్యను ట్రాఫిక్ హోంగార్డు అడ్డుకున్నారు. సౌమ్య కారు దిగి హోంగార్డును దూషించడంతో పాటు దాడికి యత్నించింది. హోంగార్డు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు సౌమ్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


అయితే పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా 7సంవత్సరాలలోపు జైలు శిక్ష పడే కేసులో ఉన్నాయి కాబట్టి... చట్ట ప్రకారం 41ఏ నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని సౌమ్యకు సూచించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని.. అధికారులు అడిగిన వివరాలు తెలపాలని ఆదేశించింది. దీంతో సౌమ్య బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: